నేను అనాధను కాను
నాపిల్లలు రెక్కలొచ్చిన పక్షులు
విదేశాలకి వలసలు
నాదేశం లో తృప్తిగా స్వేచ్ఛగా
బతుకుతున్న సనాధను
అమ్మా అమ్మమ్మా బామ్మా అని అనాధబాలలు ఆప్యాయంగా
నాచుట్టూ తిరుగుతూ ఉంటే
కంప్యూటర్ లాప్టాప్ తో కుస్తీ పడుతూ
బాట్స్ మాన్ లాగా ఎగిరి రోబోట్లు గా మారిన నాపిల్లలు
హలో మామ్!అని వీడియో కాల్స్
డాలర్లు పౌండ్స్ నదుల్లో ఈదుతూ కార్లలో షికార్లు కొట్టే
నాకన్న బిడ్డలు గుండెలపై పరిచారు బండలు
నాలాగా ఒంటరి అమ్మలకు ఆసరాగా ఉంటా
నాజన్మను ధన్యం చేసుకుంటా
రక్తసంబంధం తో లేదు పని
ఆప్యాయంగా పలకరించే
ప్రేమ గా వీపునిమిరే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి