అర్థంకావు;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చంద్రుడి చల్లదనం
ప్రకృతి పచ్చదనం
సూర్యోదయపు పలకరింపు
సూర్యాస్తమయపు చిలకరింపు
చిరుజల్లుల జలదరింపు
మరుమల్లెల మధురిమ
సంపంగి ఘుమఘుమ
రేయంతా రెప్పవాల్చని నక్షత్రాలు
మత్తుగా నిద్రలోజోగే మేలిమబ్బులు
పుడమిపై నిండుగా వెలిగి
నవ్వులపువ్వుల్ని వెదజల్లే వెన్నెల
ఇవేవీ
ప్రేమను ప్రేమించలేని వాళ్ళకు
అర్థంకావు చెలీ!
నీకూ నాకూ తప్ప!!
*********************************

కామెంట్‌లు