బంగారు పురుగు-బాల గేయం- ఎడ్ల లక్ష్మి
బండి పోయే తోవలో
బంతిపూల తోటలో
బంగారు పాపాయి
వంగి వంగి దాగింది

బంగారి రంగు పురుగు
రెకలు విప్పి లేచింది
అది పై పైన తిరిగింది
పువ్వు మీద వాలింది

దాగిన పాపా చూసింది
పాప పురుగును పట్టింది
దానికి దారం కట్టింది
గిరగిర దాన్నే తిప్పింది

ఝుమ్మంటా పురుగు
రా రమ్మని పిలుస్తుంది
రగ రగ అది మెరుస్తుంది
పాప చూసి మురుస్తుంది


కామెంట్‌లు