పూజకు పూసిన పువ్వు (బాల గేయం)-ఎడ్ల లక్ష్మి
కాలువ గట్టున గోవు
గరుక మేసే తావు
వదలి వెళ్లిపోవు
చూసి మురిసే గడ్డిపువ్వు!

నల్లతుమ్మెద చూసింది
జుం జుమ్మని లేచింది
పువ్వు మీద వాలింది
వాడిపోయింది పువ్వు!

గండు చీమలు వచ్చాయి
చెట్టు చుట్టూ చేరాయి
తుమ్మెద వెళ్లిపోయింది
మొగ్గ విరబూసి నవ్వింది !

చిన్నారి పాపయి వచ్చింది
పూసిన పువ్వులు తెంచింది
పువ్వుల మాల కట్టింది
దేవుని మెడలో వేసింది!

కామెంట్‌లు