అరిషడ్వర్గం తో....
కూడి అహంకారం...
స్వైర విహారం... !
జీవుడు దేవుడు దూరం !!
*******
అహంకారాధముడు ....
మహిషా సురుడు !
దేహ రాజ్యముపై....
దండెత్తినాడు... !!
*******
మనో రాజును...
లొంగదీసుకుని....
. షట్చక్రములను...
ఏలు చుండెను !
*******
బుద్ది సేనాపతి యౌ
జీవుని గూడగ ...
...ఆరు చక్రములు ...
విముక్తి నొందెను !
******
వివేకంతో జీవుడు
మేల్కొంది శక్తి !
నవరాత్రి సమరం
అసురమరణం !!
*******
దుర్మార్గ దురాగంతో...
కలిగిన ఖేదం...
మంచి గెలుపుతో....
వచ్చెను మోదం !
******
ఏకమనేకమై....
అనేకమేకమై.....
దుష్ట సంహారం....
విజయానందోత్సాహం ... !
********
విజయోత్సాహం...
దశమి ఉత్సవం. !
పరమాత్మ సంగమం...
ఆత్మానందార్ణవం.. !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి