అక్షర శ్రామికుడు-: కె.కవిత-: హైదరాబాద్
ప్రక్రియ: సున్నితం
:------------------------
అలుపు సొలుపు లేనివాడు
మెదడుకు పదును పెడుతుంటాడు
అక్షరానికి నీరాజనం పలికేవాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు


కలంలో ఎన్నో జనియిస్తాయి
పద్యమైన గద్యమైన కవితైనా
మనసును గిలిగింతలు పెడతాయి
చూడచక్కని తెలుగు సున్నితంబు


అక్షర రూపంలో అందంగా
మదిలో భావాలను ప్రత్యక్షంగా
కళ్ళముందు నిలిపే దేవీసుతుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు


మెచ్చుకోలు అతనికి బలం
సన్మానాలు ఆతనికి ఆభరణం
పేరు ప్రతిష్టలు చిరస్మరణీయం
చూడచక్కని తెలుగు సున్నితంబు


మంచి రచనలతో తానే
తనదైన ముద్ర వేస్తాడు
సాహిత్య లోకంలో ప్రకాశిస్తాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు
Raghunandan kurudi చెప్పారు…
బాగుంది కవిత