కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు మరో ఘనత సాధించారు.
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) సీనియర్ నేత కొత్తకోట రామలక్ష్మి ఐదవ వర్ధంతి సందర్భంగా, వారి స్మృత్యర్థం నిర్వహించిన జిల్లా స్థాయి కవితల పోటీల్లో కన్సోలేషన్ విజేతగా నిలిచి బహుమతి పొందారు.
ఆధునిక సమాజంలో స్త్రీ పాత్ర అను అంశంపై ఈ పోటీలు నిర్వహించగా, తిరుమలరావు మగువ తెగువ అను కవితను పంపి గెలుపొందారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల యుటిఎఫ్ కార్యాలయ వేదికపై తిరుమలరావుకు, యు.టి.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉప విద్యాశాఖాధికారి కొత్తకోట అప్పారావు, జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎస్ కిశోర్ కుమార్, ఉక్కు అభ్యుదయ కళావేదిక ప్రజానాట్యమండలి గాయకులు చింతాడ రామచంద్రరావు, సాహితీవేత్త పైడి జగన్నాధంల చేతులమీదుగా జ్ఞాపిక, అభ్యుదయ గ్రంథాలను బహూకరించారు.
ఈ మహిలో మహిళంటే మహిమగల విజయకేతనమై నిలవాలి శక్తి స్వరూపిణిగా అంటూ,
ఇంతుల వీరగాథల దిశగా చూపాలి తెగువ అన్ని రంగాల్లో మహిళ అంటూ తిరుమలరావు తన కవితలో చాటిచెప్పారు.
న్యాయనిర్ణేతల బృందం ఎం.వాగ్దేవి, గొంటి గిరిధర్, కార్యక్రమ నిర్వాహకులు విశ్రాంత ఉప విద్యాశాఖాధికారి కొత్తకోట అప్పారావు, యుటిఎఫ్ ప్రతినిధులైన రెడ్డి మోహనరావు, చౌదరి రవీంద్ర, విజయగౌరి, బాబూరావు, ధనలక్ష్మి, శ్రీరామమూర్తి, ఉమామహేశ్వరరావు తదితరులు తిరుమలరావు కవితను అభినందిస్తూ సత్కరించారు.
తిరుమలరావు జిల్లా విజేతగా బహుమతి పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి