గత్వాతు స మహత్మానాం రామం సత్య పరాక్రమం!
అయా చత్ భ్రాతరం రామం ఆర్యా భావ పురస్కృతః
త్వం ఏవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచః అబ్రవీత్ !
రామో పి పరమో దారః సుముఖః సుమ మహా యశాః !
ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయినా శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్య భావముతో
"ఓ ధర్మ జ్ఞా! జ్యేష్టుడవు ,శ్రేష్టుడవు అయినా నీవే అయోధ్యకు రాజు కాదగిన వాడవు"అని పలుకుచూ
సోదరుడైన , శ్రీ రాముని వేడు కొనెను.
మిక్కిలి ఔదార్యము కలవాడును, ఎల్లప్పుడూ
ప్రసన్నముగా ఉండువాడును, వాసి గాంచిన వాడును, అయినా శ్రీరాముడు అర్ధుల ప్రార్ధనలను
మన్నించు వాడే అయినప్పటికీని, తండ్రి ఆదేశమును
అనుసరించి రాజ్యాధికారమును, చేపట్టుటకు ఇష్టపడలేదు !
ఓం శ్రీ రామం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి