రెండు రెండే బాల గేయం;- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
పేరు పెరమాండ్లు
ఊరు అనుమాండ్లు
తీరు కడగండ్లు
జోరు మేడిపండ్లు

మాటతో పేలేటి తూట
చూపుతో పగులేను రాయి
నడకతో చేరే గమ్యం
ఎటు చూసినా శూన్యం!

అంగట్లో ఉంది గొంగడి
గొంగట్లో ఉంది సంగడి
బొందడు చేసే సందడి
ఆపలేరెవరా దొందడి!

ఆ రెండు రెండే నంట
రోకండ్ల పోసలంట
చేతిలో అమరయంట
కుదురుగా ఉండయంట!

వాటిని చూసేది ఎవరు
వాటికి చెప్పేది ఎవరు
వాటి సోద్యమిప్పేదెవరు
ఎవరు ఉలకరు పలుకరు !

కామెంట్‌లు