జ్ఞాపకం- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 బతుకు తీగెపై
సరిగమలు వాయిస్తోంది 
నీ జ్ఞాపకం
అప్పుడే రంగులద్దిన
తడి తైలవర్ణ చిత్రంలా వుంది 
నీ జ్ఞాపకం
అందమైన ఉషోదయాన
తడి ఆరిన పువ్వులు
అలవోకగా పుప్పొడి రాల్చినట్లు 
నీ జ్ఞాపకం
వెన్నెల రాత్రి
సైకత విహారాల వేళ
సెలయేరు పెదవి విప్పినట్లు 
నీ జ్ఞాపకం
చెలీ!
నీ జ్ఞాపకాలు మౌనగీతాలై
నాలో ప్రతిధ్వనిస్తున్నాయి!!
*********************************

కామెంట్‌లు