రాజాం విద్యా నికేతన్ పాఠశాలలో నేడు జరిగినరాజాం రచయితల వేదిక 105వ సమావేశంలో, రారవే సభ్యులు కుదమ తిరుమలరావు గురుబ్రహ్మ సంకలనాలను బహూకరించారు. రారవే కన్వీనర్ గార రంగనాథం, సభాధ్యక్షులు పిల్లా తిరుపతిరావు, నేటి ముఖ్యవక్త ఒమ్మి రమణమూర్తి, ప్రముఖ కవి గాయకులు డా.ఆల్తి మోహనరావు, నంది పురస్కార గ్రహీత తురంగి విశ్వనాధం తదితరులు ఈ గురుబ్రహ్మ సంకలనాలను స్వీకరించారు.
ఇటీవల బొబ్బిలి రచనా సమాఖ్య అధ్యక్షులు మింది విజయమోహనరావు ఆధ్వర్యంలో, బొబ్బిలి రాజు ఆర్ వి ఎస్ ఎస్ కె కె రంగారావు బేబీ నాయన ఈ గురుబ్రహ్మ
సంకలనాన్ని ఆవిష్కరించారని, ఈ సంకలనంలో గురుసాక్షాత్ పరబ్రహ్మ అను తన కవిత స్థానం పొందిందని రచయిత కుదమ తిరుమలరావు తెలిపారు. జాతీయ స్థాయిలో వెలువరించిన ఈ గురుబ్రహ్మ సంకలనంలో తన కవితను ఎంపిక చేసి, తనను సత్కరించిన బొబ్బిలి రచనా సమాఖ్య ప్రతినిధులు ఎమ్.విజయమోహనరావు, పి.నాగరాజు, టి.వెంకటరమణ, ఆర్.గోవిందరావు, చివుకుల శ్రీలక్ష్మి, పాలక అర్జునుడు తదితరులకు తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గురుబ్రహ్మ సంకలనంలో ముద్రితమైన తన కవిత గురుసాక్షాత్ పరబ్రహ్మ అను కవితను వినిపించి, అందరి అభినందనలను పొందారు.
ఈనాటి కార్యక్రమంలో సాహితీవేత్తలు రౌతు గణపతిరావునాయుడు, పడాల కవీశ్వరరావు, పొదిలాపు శ్రీనివాసరావు, బొంతు ప్రవాహి సూర్యనారాయణ, పెంకి చైతన్య కుమార్, పి.దయానిధినాయుడు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి