న్యాయాలు -301
శ్వానారోహ న్యాయము
****
శ్వానము అంటే శునకము లేదా కుక్క. ఆరోహ అంటే ఎక్కువాడు,ఎక్కుట, పైకి పోవుట, ఎత్తు, ఔన్నత్యము అనే అర్థాలు ఉన్నాయి.
"శ్వానారోహే కుతఃసౌఖ్యమ్" గుర్రము మొదలైన వాటిని వదిలేసి కుక్క మీద స్వారీ చేస్తే సుఖం ఏముంటుంది? అనే అర్థంతో ఈ "శ్వానారోహే న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
లాభకరమైన పనులను వదిలేసి, గౌరవప్రదమైన చర్యలను వదిలేసి ఇతరులకు నవ్వు పుట్టించేలా,చూపరులకు చిరాకనిపించేలా చేసే పనులను గురించి చెప్పేందుకు ఈ "శ్వానారోహ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి సంబంధించి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారిచే రచింపబడిన వ్యంగ్య ,హాస్య ప్రధానమైన గణపతి నవలలో గణపతి ప్రవృత్తిని చూద్దాం...
ఇందులో కథానాయకుడు గణపతి. అతడు చిన్నప్పటి నుండి చాలా అల్లరి వాడు. ఈ నవల చదువుతున్నంత సేపు అతనికి సంబంధించిన హాస్య సన్నివేశాలు చూసి నవ్వకుండా వుండలేం . పొట్టచెక్కలయ్యేలా నవ్వొస్తుంది. గణపతికి గుర్రంపై స్వారీ చేయాలనే కోరిక అడపాదడపా తప్ప ప్రతిరోజూ తీరదు. అందుకని ఓ బట్టలుతికే వ్యక్తి దగ్గర గాడిదను అడిగి ఎక్కి తిరగడము అది చూసి పిల్లలు బుట్టలు చేటలు వాయించడంతో అది బెదిరి పోయి పరుగెత్తడం ,దాని మీద నుంచి గణపతి దూకడం... పైగా "వసుదేవుడంత వాడు గాడిద కాళ్ళు పట్టుకోవడం వల్లే శ్రీకృష్ణుడు బతికి పోయాడని" ఎందరో దేవతలకు గుర్రం లాంటి వాహనాలు కాకుండా ఎద్దు ,ఎలుక,చిలుక, దున్నపోతు మొదలైనవి ఉన్నాయి కదా! అంటూ అనేక పురాణేతిహాసాల గాధలు వల్లించడం...చదువుతుంటే నవ్వునెంత బిగబట్టుకున్నా ఆపుకోలేం.
అలా కొంతమంది వ్యక్తులు భలే విచిత్రంగా ఉంటారు. ఎక్కువ లాభమొచ్చే పనిని, హుందాగా ఉండాల్సిన వాటిని వదులుకొని తక్కువ వాటి కోసం ఆశ పడుతుంటారు. వాళ్ళ చేష్టలు"కంచం అమ్మి మెట్టెలు చేయించుకున్నట్లు" గా వుంటాయి- ఇలా చిన్న చిన్న, చిల్లర పనులు చేస్తూ అందులోనే ఆనందం, సుఖం వుందని నమ్ముతారు.ఇలాంటి వారు కొందరు నిత్య జీవితంలో మనకు తారస పడుతూ వుంటారు.
"వాళ్ళ లాంటి అవివేకమైన,అగౌరవమైన పనులు చేయొద్దనీ,అలా చేసి అందరిలో నవ్వుల పాలు కావద్దని ఈ "శ్వానారోహ న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు. అంతే కదండీ! చేసే పని చిన్నదో,చితకదో హుందాగా, మర్యాదగా ఉండేలా చూసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి