ఆ గర్భ వాసన
హేతుబంధము !
అనుభవించగా....
గత కర్మల ఫలము !!
********
పాపానికి దుఃఖం...
సుఖాని కానందం !
ఈ నేల పైనే...
ఆ స్వర్గం - నరకం !!
******
అనురాగాలు...
ఆప్యాయతలు....
సంబంధ బాంధవ్యాలు
అన్నీ ఋణానుబంధాలే !
*******
నిన్నటివి... నేడు...
నేటివి... రేపు... !
పునః... పునః...
దాటలేనిదీ వలయం !!
*******
చావు వెనుక పుట్టుక
పుట్టుక వెంటే చావు... !
జ్ఞానమొక్కటే...
దాటించే నావ... !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి