సాక్షాత్కారం;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 తళుక్కున
ఒక మెరుపు
ఆకాశంలో మెరిసినప్పుడు,
ఒక పుష్కలావర్తకము
మదగజంలా
ఘీంకరించినప్పుడు,
ఒక మలయపవనవీచిక
నా తనువు నిండా
చందనము అలదిపోయినప్పుడు,
అప్పుడు…. అప్పుడు….
నా ఆత్మ
పాలకెరటమై
పరవళ్ళు తొక్కింది
చెలీ!
ఇదంతా
నా కనుల ఎదుట
నీ 
సాక్షాత్కారం వల్లనే కదూ?!!
*********************************

కామెంట్‌లు