గాయత్రీ నమోస్తుతే; - వెంకట రమణారావు వైజాగ్


పంచ వదనే  వేదమయీ
 గాయత్రి కరుణామయీ
సావిత్రీ  శక్తి మయీ
శ్రీ నిలయే   శ్రీమాత్రే 
నమోస్తుతే నమోస్తుతే

తపస్వినీ సత్య వాక్ రూపిణీ 
 సర్వ లోక వాసినీ శివమయే
నిత్యానందే మహామాయే
జగదీశ్వరీ మంత్ర స్వరూపిణి
నమోస్తుతే నమోస్తుతే

విధాత సరసన శ్రీ వాణి వై
విష్ణు హృదయ ప్రియ శ్రీ కమలవై
హర మేన సగమైన గిరి బాలవై
ఈ ఇల వెలసిన శ్రీగాయత్రీ
నమోస్తుతే నమోస్తుతే

ముక్తా విధ్రుమ హేమ
నీల ధవళ ముఖే
బ్రహ్మాండ రూపిణీ
బ్రహ్మచారిణి
శ్రీ మాత్రే నమోస్తుతే
నమోస్తుతే నమోస్తుతే

కామెంట్‌లు