సుప్రభాత కవిత ; - బృంద
ప్రత్యూష వేళలో 
ప్రకృతి  పరవశాలు
అణువణువూ చైతన్యపు
రంజిల్లు శోభలు

నీహారికల తలపై మోస్తూ
పాదాలను కడగాలని
ఎదురు చూపులు చూస్తున్న
పచ్చికకు కనకపు కాంతులు

విహగాళి కువకువలతో
కళ్ళుతెరచిన  జగతి
ఒళ్ళు విరుచుకుని వేకువను
ఆస్వాదిస్తున్న వనం

పొడవైన వృక్షాలను
ఆలింగనం చేసుకున్న
కొల్లగా పూలతో నిండిన
అల్లరి లతలు

చిక్కటి వనంలో  మెరిసిన
చక్కని వెలుగులు పంచుతూ
రెప్పల దాగిన స్వప్నంలా
తళుకుమన్న సూర్యుడికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు