సొంత జిల్లాలో సంతకం - మరువరాని సంతసం

 శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలం, కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఇటీవల జరిగిన పనిసర్దుబాటు బదిలీల్లో పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం, వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. 
కుదమ తిరుమలరావు సొంతూరు కుదమ కూడా పార్వతీపురం మన్యం జిల్లాయే కావడంతో, సొంత జిల్లాలో సంతకం చేసిన సంతృప్తి కలిగింది. ఎక్కడ పనిచేసినా ఆ ఊరుని సొంతూరు వలే, ఆ జిల్లా సొంత జిల్లావలే, ఆ పాఠశాలల విద్యార్థిణీ విద్యార్థులు సొంత బిడ్డలవలే, తోటి ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు తోబుట్టువుల వలే భావించి మంచితనంతో మెలుగుతూ గుణాత్మక విద్యాసాధనే లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం చేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, అధికారికంగా సొంత జిల్లాలో సంతకం చేసిన ఆ క్షణం మరువరాని మధుర స్మృతిగానూ, ఉద్వేగభరితమైన సంతసంగానూ నిలిచిందని ఆయన అన్నారు. 
విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ పంచాయతీ, కుదమ గ్రామానికి చెందిన తిరుమలరావు 
1989 నుండి శ్రీకాకుళం జిల్లాలోనే పనిచేస్తుండగా 04.04.2022లో తాను పనిచేస్తున్న రాజాం విజయనగరం జిల్లాలో విలీనమైంది. అదే సమయంలో విజయనగరం జిల్లాలోనున్న కుదమ సొంతూరు, పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం కావడంతో మరలా వేర్వేరు జిల్లాల అనుభూతియే కొనసాగింది. ఐతే నాలుగు నెలల క్రితం విజయనగరం జిల్లా రాజాం నుండి, శ్రీకాకుళం జిల్లా కడుము పాఠశాలకు బదిలీపై వెళ్లిన తిరుమలరావు, పనిసర్దుబాటు పేరిట జరిగిన బదిలీల్లో పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం, వోని పాఠశాలకు బదిలీ కావడంతో సొంత జిల్లాలో సంతకం చేసిన సంతృప్తి కలిగింది. 
ఈ బదిలీలు ఆనాటి పదమూడు జిల్లాల పరిధిని దృష్టిలో ఉంచుకుని చేయడం వలనే తనకి ఈ విధమైన అవకాశం వచ్చిందన్న ఆనందాన్ని వ్యక్తం చేసారు తిరుమలరావు.
ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ 
ఎక్కడ పనిచేసినా విద్యార్థుల చదువుల స్థాయిని పెంపొందించేందుకు ఎప్పటివలే మరింత కృషి చేస్తానని అన్నారు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం