చెప్పుకోలేని భావాలు
తప్పుకోలేని పరిస్థితులు
ఒప్పుకోలేని నిజాలు
కప్పుకోలేని పొరలు...
వాదించినా దొరకని గెలుపు
సాధించినా గుర్తించని బంధాలు
బోధించినా తెలియని పాఠాలు
బాధించే పలు కారణాలు
పలకరించని మమతలు
చిలకరించని ప్రేమలు
తొలకరించని రోజులు
కనికరించని కాలం
మార్చుకోలేని నిబంధనలు
ఓర్చుకోలేని ఇబ్బందులు
కూర్చుకోలేని అభిప్రాయాలు
తేల్చుకోలేని సందేహాలు
ఎదగని మనసులు
ఒదగని తత్వాలు
మెదగని జీవితాలు
తుదిలేని సమస్యలు
తిట్టుకోలేని భయం
తట్టుకోలేని బాధ
పట్టుకోలేని కోపం
ముట్టుకోలేని కాలం
భవబంధాల జీవితానికి
జవసత్వాలను అందించి
కువకువలతో నిద్రలేపే
నవ నవోన్మేషమైన వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి