* జోహారులు *;- .... కోరాడ నరసింహా రావు !
మాతృ దేశ రక్షణలో.... 
 కంటికి రెప్పలా.... 
   అహర్నిశలు కాపుకాయు 
   సరిహద్దుల్లో సైనికు లారా !

శీతోష్ణ, సుఖ, దుఃఖా
  దుల కతీతులౌ..... 
   స్థిత ప్రజ్ఞులు మీరు... 
   నిజ  త్యాగ ధనులు !

కుటుంబాలు విడచి... 
  మృత్యువు కెదురెళ్ళే... 
   ధీరులు  -  వీరులు.... 
  మీరు ఘనమైన వారు !

వీరోచిత పోరులో.... 
  అసువులు బాసి.... 
  అమరులైన మీకు... 
   ఇవియే  మా  జోహార్లు !!
   💐🙏🌷💐🌷🙏
     *******


కామెంట్‌లు