పాలకొండ మండల పరిషత్ ఉపాధ్యక్షులు కనపాక సూర్యప్రకాశరావుకు, వోని ఎంపియుపి పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు గురుబ్రహ్మ సంకలనాలను బహూకరించారు.
వైస్ ఎంపిపి సూర్యప్రకాశరావు ఇంటివద్ద జరిగిన కార్యక్రమంలో
సర్పంచ్ కె.రమణమ్మ,
పాఠశాల ప్రధానోపాధ్యాయని
బలగ నాగమణి, సహోపాధ్యాయులు
పాలవలస శారదాకుమారి,
గోగుల సూర్యనారాయణ,
దానేటి పుష్పలత,
సిద్ధాబత్తుల వెంకటరమణ తదితరులు
ఈ గురుబ్రహ్మ సంకలనాలను స్వీకరించారు.
ఇటీవల బొబ్బిలి రచనా సమాఖ్య అధ్యక్షులు మింది విజయమోహనరావు ఆధ్వర్యంలో, బొబ్బిలి రాజు ఆర్ వి ఎస్ ఎస్ కె కె రంగారావు బేబీ నాయన ఈ గురుబ్రహ్మ
సంకలనాన్ని ఆవిష్కరించారని, ఈ సంకలనంలో గురుసాక్షాత్ పరబ్రహ్మ అను తన కవిత స్థానం పొందిందని రచయిత కుదమ తిరుమలరావు తెలిపారు. జాతీయ స్థాయిలో వెలువరించిన ఈ గురుబ్రహ్మ సంకలనంలో తన కవితను ఎంపిక చేసి, తనను సత్కరించిన బొబ్బిలి రాజు బేబీనాయన, రచనా సమాఖ్య అధ్యక్షులు మింది విజయమోహనరావు, ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు, సమాఖ్య ప్రతినిధులు టి.వెంకటరమణ, ఆర్.గోవిందరావు, చివుకుల శ్రీలక్ష్మి, పాలక అర్జునుడు తదితరులకు తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలరావు, గురుబ్రహ్మ సంకలనంలో ముద్రితమైన గురుసాక్షాత్ పరబ్రహ్మ అను తన కవిత వినిపించి,
అందరి అభినందనలు పొందారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి