చకోరం (కథ)- పి కె.రావు కొత్తపట్నం
 ఎంతకాలం గా ఎదురు చూస్తావమ్మా...నీఎదురుచూపు చూసి చకోరంకూడాసిగ్గు పడుతుందమ్మా..అన్న రామ నాధం ప్రశ్నకు బేలగా చూసింది సీతమ్మ
ఆమె కళ్ళు ఎదురుచూసి చూసి గాజుగోళ్ళల్లా తయారైనాయి.ఆమె‌చూపుల్లో ఎదో ఆశ .ఎవరి కోసమో ఎదురు చూస్తున్న ట్లు  ఉన్న ఆమె ముఖారవిందం చూసి ఎందుకో అర్దం కాక అటుగా వస్తున్న నారాయణ న్ను నిలేశాడు ఆశ్రమ యజమాని కదా అని ఆశతో ఏదైనా చెప్పక పోతాడా అన్న కోరిక కొరివిలా రొదపెడుతుంటే.
మాజి జర్న లిస్టు అయిన రామ నాధం ను తన వెంట రమ్మంటూ సైగ చేసి  ముందుకు అడుగులేశాడు.అతని వాలకం చూస్తే తన కు సమాధానం దొరుకుతుందని ఆశతో అతన్ని అరుసరించాడు.
అది ఒక ఆశ్రమం వృద్దులకు ఆశ్రయం ఇస్తుంది.నారాయష దాని నిర్వహకుడు.రామనాధం జర్నలిస్టు గా పనిచేసి అందర్ని పోగొట్టకుని‌ ఆశ్రమంలో చేరాడు అందరిలా.
ఉత్సాహంగా అతని‌వెంట వచ్చిన రామనాధం అతను‌చూపిన కుర్చీలో కూర్చున్నాడుఅతను చెప్పెది వింటానికి సిద్దమై.
ఆమె పేరు సీతమ్మ ఆమె భర్త వెంకయ్య ఇక్కడకు దగ్గరలో ఉన్న లింగాలపురం వారి ఊరు.వాళ్ళకు ఒక్కడే కొడుకు పేరు రాజు.కలిమిలో ఉన్నా కన్నబిడ్డకు తెలియకుండా అపురూపంగా పెంచారు రాజును.అతడు కూడా గారాబాన్ని దుర్వినియోగం చెయ్యకుండా బాగానే‌చదివాడు.లేమిని కంట‌బడనీయకుండా కలిమి తో ఉన్నట్లుగా పెంచారు‌బిడ్డను
అతనిగారాబం తల్లి దగ్గరసాగకపోయినా తండ్రి దగ్గర సాగేది .ఆడింది‌ ఆటగా పాడింది పాటగా సాగింది.వయసుతో పెరుగుతున్న అవసరాలు  రెచ్చగొట్టే కోరికలు తల్లి దండ్రుల కష్టాన్ని గుర్తించలేకపోయాయి.తల్లి కాస్త అడ్డు చెప్పినా తండ్రి  తనకోరికల బండికి ఇంధనం అవుతున్నాడన్న ఆలోచన అతని‌బండిని అదుపులో పెట్టలేకపోయాయి.అతని చదువు అవసాన దశకు వచ్చిన సమయంలో అనుకోకుండా  ఫఢ్ఢాడు‌వెంకయ్య.ఆఖరిదశలో నీకష్టం తెలియకుండా.బిడ్డని పెంచు వాడికి ఇష్టమైన వి అన్ని చెయ్యి .వాడికి బెండకాయ కూరంటే‌ఇష్టం అది చెయ్యడం మర్చి పోకు వాడికి కష్టం కలిగించకని మాట తీసుకుని కన్నుమూశాడు. చదువు పూర్తిచేసుకుని ఓ కలిగినింటి పిల్ల సహవాసం తో తల్లికి చెప్పకుండ ఉదరపోషణార్దం విదేశాలకు చెక్కేశాడు రాజు.ఎవరూలేని ఆమెను ఈఅనాధాశ్రమంలో చేర్చారు ఎవరో పుణ్యాత్ములు. అప్పటి నుండి బిడ్డవస్తాడని ఎదురు‌చూస్తూ చేతిలోబెండకాయ కూరన్నంతో ఎదురు చూస్తుంది ఆతల్లి కొడుకు కోసం తల్లడిల్లి.అంటూ ముగించాడు నారాయణ.
మానేసిన జర్నలిజానికి ఎవరిదగ్గరో అడ్రసు సంపాదించి కన్నతల్లని‌వదలి కట్టుకున్నదానితో వెళ్ళి పోయిన ఆకొడుక్కు మెయిల్ పంపాడు.
మెయిల్ కు సమాధానం గావచ్చిన రాజుని  అమ్మంటే విలువ తెలియని నువ్వు విదేశాలలో ఏమి ఉద్దరిస్తున్నావు.అంటూ తల్లి ఔన్నత్యాన్ని ‌వివరించాడు.తనకోసం ఇంతగా తపించే తల్లి కాళ్ళ పై బడ్డాడు రాజు.ఆమెచేతి‌ముద్ద నోట్లో పెట్డుకుంటూ కన్నీళ్ళతో కాళ్లు కడిగాడు.
➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు