పండుగ లంటే.... ! - * కోరాడ బాలగేయం *
పండుగల యొక్క గొప్పతనం 
 తెలియునా మీకు, పిల్లలూ.... 
పండుగలంటే... తెలుసుకోండి 
మీరుపండుగచేస్కోండి పిల్లలూ 

పండుగలంటే, భక్తి - శ్రద్ధలు... 
 పండుగలంటే... ఉత్సాహాలు... 
 పండుగలంటే... ఉల్లాసాలు... 
  పండుగలంటే... ఆనందాలు !

 మనబ్రతుకుల్లో ఆటంకాలు - 
. కష్టాలేవీ  కలుగరాదని... 
.. మునుముందుగ మనము
  శ్రీ  గణేశుని పూజిస్తాము... !

మనం, రెండవ పండుగగా... 
 లోకకంటకుడుమహిషాసురుని
  చంపి, లోకాన్ని కా పాడిన .....  
  ఆదిశక్తి,ఆజగన్మాతనుఆరాధి  స్తాము ! 

ఈ దసరాపండుగనే.... 
   విజయదశమి అని అంటారు 
   ఈ రోజే ఆ శ్రీరాముడు... 
   అసుర రావణుని జంపె నట 

మనకు వెనువెంటనె వచ్చు... 
 నరకచతుర్దశి, దీపావళి !
 మనబ్రతుకులలోకష్టాలచీకట్లు
   తొలగించే దీపాల పండుగిది ! 

 పై రెండూ ,...భక్తి, శ్రద్ధలు-..                
    ఆనం దోత్సాహాల తో 
  తొమ్మిదిరోజులు...జరుపుకునే
నవరాత్రులపండుగలివి,పిల్లలు 
    

తదుపరి వచ్చే ముఖ్యమైనది 
 సంక్రాంతి పండుగ.... !
   రైతుల కష్టం ఫలించి.... 
  ధాన్యపు రాసులు ఇళ్లకు....
.   చేరిన సంతోషంలో..... 
    ముచ్చటగా మూడురోజులు 
   జరుపుకునే... 
        పెద్దపండుగని  అంటారు !
మనపూర్వులందరినితలుచుకునే 
. పెద్దల పండుగ  ఇదియే... !!

ఇంకా  మనకున్నవి.... 
    ఎన్నెన్నో జాతీయ  పండుగలు !
. స్వాతంత్ర్య దినము... 
  గణతంత్ర దినోత్సవము !
   ఇవియే కాక.... 
    గాంధీ, సెహ్రుల వంటి... 
   ఎందరెందరో మహనీయుల జన్మదినములు !
  ఈ పండుగలన్నిటినీ.... 
   కులము - మతముల తేడా చూడక 
   దేశ ప్రజలందరమూ..... 
  గౌరవ - మర్యాదలతో.... 
  కలసికట్టుగాజరుపుకొందుము 

 మన పండుగల పరమార్ధం 
  మీకుతెలిసిందికదాపిల్లలు 
  మన పూర్వుల వలె మీరూ 
 జరుపుకోవాలి మన పండుగలు !!
        *******
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం