అస్తిత్వం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నీ ప్రేమామృత దృక్కుల చిరుజల్లుకే
నేను వరద గోదారినయ్యాను 
తెలి మబ్బుల వెన్నెల్లో
ఏటి ఇసుకతిన్నెల్లో
నత్తగుల్లలు, గులకరాళ్ళేరుకున్న 
నా బాల్యం తిరిగి వచ్చిన అనుభూతి 
అనంతాకాశపు ఆవలితీరాన 
నీవు ఆలాపించిన రసఝరి 
నా అమాయకత్వాన్ని
నిలువునా తడిపేసింది
మనిద్దరిమధ్యని
ఈ చిరుచీలిక
నన్ను
నిబిడాంధకారంలో చిత్తడిచేసి 
నీ మౌన పరిష్వంగంలో 
నా అస్తిత్వాన్నే సవాల్ చేసింది
ఈ ఛందో బందోబస్తులన్నీ 
చట్ఫట్ మనిపించి
ఈ అహంకారపు ఇనుపగోడలను 
తునియలు చేసి 
మమకారపు చిరునవ్వులు పూయిద్దాం
మన హృదయ కవాటాల 
గొళ్ళాలూడదీసి 
సుందర ప్రేమైక నందనోద్యానంలో
సుమధుర పరిమళవీచికలను ఆనందిద్దాం!!
*********************************

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం