పంకంలో పుట్టిన పంకజం వేలరేకుల చేత వెలిగి పూజార్హతను పొందుతులసి ఎక్కడ మొలచినాదాని ఘనత దానిదేపుట్టుక ఎక్కడైనాతగ్గని పరిమళం!!ఆటవికుడు అయితే నేమిచోరుడైతేనేమి పూర్వజన్నవాసననో దేవుని అనుగ్రహమోమానవుడు మహర్షి అయ్యాడుమానవుని చరిత్ర రాసిపూజ్యనీయుడయ్యాడు!!అరణ్యంలో వచ్చిన వారిని హింసించి దోచుకునుచు కుటుంబాన్ని పోషించుఒకనాడు నారదుని దోచుకొనప్రయత్నించ పన్నాగంతో ప్రశ్న వేసేఎవరికొఱకు ఈ దోపిడీ ఆన భార్యా పిల్లల కొరకని చెప్ప నీవు చేసిన పాపమును వారు పంచుకొనెదరని అడుగుమనగావెళ్లి అడుగా మేము నీవు చేసిన పాపమును పంచుకొనమనగా విరక్తి చెందితపమాచరించే!!తాపసి చుట్టూ పుట్టఆవరించవల్మీకంనుండి వచ్చిన ఋషి ఆయే వాల్మీకిగా మారేక్రౌంచ పక్షి జంటను కొట్టె వేటగాడొకడుబాణం తగిలి మగపక్షి కిందపడి చనిపోగాఏడ్చు ఆడపక్షిని చూచి చలించినఋషి నోటినుండి మా నిషాదశ్లోకముదయించేశోకం నుండి శ్లోకం వచ్చేకవికోకిలగా మారే!!ఆదికవి వాల్మీకిశ్రీ రామచరితనుసంస్కృత భాషలో వ్రాయ వాసికెక్కేరామాయణం భారతీయుల సంస్కృతికి ఆనవాలుగా మారే------------------------/-
కవికోకిల వాల్మీకి మహర్షి;- డా.చీదెళ్ళ సీతాలక్ష్మివిశ్రాంత సహాయాచార్యులుహైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి