శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 లావణ్యం అంటే హిందీ లో అర్థం ఉప్పదనం అని.వ్యక్తి మొహం నుదుటి పై ఓవిధమైన మెరుపువస్తే శరీరం సౌందర్యం బాగా వికసిస్తూ కన్పడ్తుంది.ఇదే లావణ్యం అంటే.
లాస్యం అంటే శాబ్దిక అర్థం నృత్యం క్రీడ అని.నృత్యంలో లాస్యం తాండవం అని రెండు రకాలు.లాస్యం అంటే కోమలభావభంగిమలను మధురభావాలతో ప్రదర్శించడం.శృంగారం మొదలైన కోమలరసాల్ని ఉద్దీపన చేసేది.పాటకివాద్యాలకి ప్రాధాన్యత ఉంటుంది.
లీలా అంటే చిత్తంకి శాంతి ఆనందం మనోరంజనం కల్గించే ది.కేళి క్రీడా అంటాం.కావ్యశాస్త్రప్రకారం నాయిక శృంగార చేష్టలు.భగవంతుని లీలలు అద్భుతంగా ఉంటాయి.శిష్టరక్షణ దుష్ట శిక్షణ ఆయన లీలలు.శ్రీకృష్ణలీలలు అందరికీ తెలిసిందే.భాగవతం అంతా పరమాత్మ లీలలే కదూ?

కామెంట్‌లు