సుప్రభాత కవిత - బృంద
బండబారిన మనసులాటి
రాతి నుండీ నీతి పుట్టినట్టూ

కఠిన శిలలు తమలో
కుసుమ కోమలం దాచినట్టూ

కానరాని చీకటి దారులలో
గోరంత వెలుగు కనిపించినట్టూ

అనంతమైన చీకటికావల
మిణుగురు వెలిగినట్టూ...

దారి తెలియని తరుణాన
రహదారి కనిపించినట్టూ

బరువుగ మారిన గుండెకు 
ఊరటగా ఓదార్పునిచ్చినట్టూ

కనుచూపులు సాగునంతవరకూ
కళ్ళప్పగించి చూస్తూ....

సత్యం జయించి తీరున నీ
మన ధర్మమే మనల నడుపుతుందనీ

విజయం తెచ్చే వేకువకోసం
సహనం వదలక ఎదురుచూస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు