నవరాత్రుల నాయికా
నవ విధ వరరూపిణీ
దశవిద్యలతో పూజల నన్దుకొని
కోరిన కోరికలు తీర్చేటి శ్రీ మాతా
జగన్మాత వై జగముల పాలించే రాజ రాజేశ్వరీ
శరత్కాల చంద్రికలలో
కనుల విందు కోలిపే
నవ రూపాలుగా
మా పూజల నందుకుని
మా ఇంట వెలిసినావు
భాగ్యాల బాల
వేదమాత గాయత్రి
ఆదరించు అన్నపూర్ణ
సిరుల రాసి శ్రీ లక్ష్మి
జ్ఞాన మాత సరస్వతి
అభయ మిచ్చ్చు చండిక
దుష్ట సంహారిణి
శ్రీ మహా దుర్గ
లోకమాత త్రిపుర సుందరీ
శ్రీ లలితా పరమేశ్వరీ
శ్రీ సింహాసనేశ్వరీ
శ్రీ రాజ రాజేశ్వరీ
వందనామమ్మా పరమేశ్వరీ
శ్రీ చక్ర సంచారీనీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి