1.కం:అమ్మవు ననురాగమయివి
బొమ్మవు మాసేవ నొంద పున్నెము నియ్యన్
కమ్మని చూపుల కాలిక
బమ్మను శాసించ గలదు భగవతి తానై
2.కం: రెమ్మలము మేము తరువుకు
మిమ్మటముగ శాఖలున్న మేలు వృక్షపున్
అమ్మవు నాక్షితిజంబున్
మమ్ముల కాపాడు తల్లి మంగళ మొసగిన్
3.కం:అమ్మిక అపర్ణ ఆర్యన్
అమ్మా నీనామ మేది నామంత్రించన్
అమ్మవు మాకందరికిన్
అమ్మను నామంబు బిలుతు అంబిక వినవే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి