1 ఉ:ఎన్నికలంటె పారునవి యేరుగ మద్యము డబ్బు జోరుగన్
ఎన్నిక నైన నాయకుడు యిమ్మను ఖర్చగు సొమ్ము మారుగన్
దన్నుగ నిల్చు నీవిధము దాపరి నాయకు డవ్వ , హేప్రభూ
యెన్నడు మారు వైనమిది ఎన్నిక లుండవి సక్రమంబుగన్
2ఉ:ఎన్నికలచ్చెనంటె నగు యిబ్బడిముబ్బడి ఖర్చు కోట్లలో
సన్నపు గాల్ల కెట్ల నివి సాధ్యము నాయకులయ్యి యేల? సం
పన్నుడు నాయకుండయిన భద్రము గాదుగ పేదవారికిన్
యెన్నడు మారు పోరచిది యెన్నిక లుండవి పేదవారికిన్?
3ఉ:నాయకులెవ్వరైన తము న్యాయము నీతిని మర్చి పాలనన్
జేయగ రాష్ట్రమంతగును చిందర వందర , వృద్ధి లేమిగన్
చేయగ రారు నాయకులు క్షేమము , ధర్మము మర్వ దుడ్డుకై
వేయకు వోటు వంచకులకు, వేదన నిచ్చెడి మాయగాల్లకున్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి