తుచ్చుని భక్తి ;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
 యిచ్చెడి వాడు యీశ్వరుడు యింపుగ నడ్గగ భక్తులెల్లరున్
ముచ్చటగిచ్చు సంపదను ముద్దుగ  బ్రాతితొ గొల్వ నాతనిన్
తుచ్ఛులు నిందజేయు హము దోషము భక్తిలొ నుండగన్ , హృదిన్
స్వచ్చత నుండకన్ చలుపు స్వార్థపు  పూజలు  యిచ్చసిద్ధికై
కామెంట్‌లు