ఆధ్యాత్మికపద్యాలు :-3&4;- మమత ఐల కరీంనగర్ 9247593432
 తే.గీ
ముక్తి మోక్షంబు నెంచుచు భువినజనులు
తపము జేసేరు వేడుచు తండ్రి కొరకు
నవని నునట్టి కష్టాల నద్బుతముగ
తీర్చి దిద్దును పరమాత్మ తీపితోడ
తే.గీ
నందగోపాల కృష్ణుండు న్యాయమెంచి
బోధ పరచగా గురువుగన్ మాధవుండు
గీత బోధతో భువిలోన నీతి తోడ
బాద నీడలన్ దాటేరు భక్తి నెంచి

కామెంట్‌లు