సామాన్యంగా కొంతమంది కొంతమంది పై సానుభూతి చూపిస్తూ ఉంటారు సానుభూతి అంటే వాళ్ళ దృష్టిలో ఎదుటివాడు పాపం ఎంతో కష్టపడ్డాడు అన్న జాలి కానీ అసలు విషయం సహ అనుభూతి శివ నాగిరెడ్డి గారు అక్కడ కనిపించిన ఏ చిన్న వస్తువునైనా చూసిన తరువాత దానిపై పరిశీలించి విషయ సేకరణ చేయడానికి పడిన కష్టం చదివే పాఠకుడు కూడా తానే ఆ బాధను అనుభవిస్తున్నాడా అన్నట్టు చదవగలిగిన సాహితీ మిత్రులకు తెలుస్తుంది ఆ బాధ నిజానికి సున్నిత మనస్కులు ఈ వ్యాసం చదివితే నిజానికి శివనాగిరెడ్డి గారు ఎన్ని పర్యాయాలు కన్నీరు కార్చారో అంతకుమించి ఈ చదువరి దుఃఖాన్ని పెంచుతాడు అది శివ నాగిరెడ్డి గారి కలానికున్న బలం. విషయ సేకరణ సినిమా దృశ్యం (కనబడేది) దానిని వ్యక్తీకరించడం రేడియో వాజ్యం (వినిపించేది) రెంటిలోనూ రెడ్డి గారు నిష్ణాతులే. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం కాదు జీవితంలో ఒక గమ్యం పెట్టుకుని దానికోసం కష్టపడే తత్వాలు కొన్ని ఉంటాయి అలాంటివారికి ఏ చిన్న అవాంతరం వచ్చిన మానసికంగా ఎంతో బాధను అనుభవిస్తారు ఆ అవాంత్రాన్ని ఎలా దాటాలి అన్న ఆలోచనతోనే మనసువికలమైపోతుంది చేయదలచుకున్న కార్యము కూడా చేయలేకపోవడం మనం సహజంగా చూస్తూనే ఉంటాం కానీ మానవుడు ఆశాజీవి ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు తప్ప ఏ సమస్య వచ్చినా దానిని పరిష్కరించుకుంటూ జీవిత ఆశయాన్ని సాధించాలి.అలాంటి కార్యసాధకుల జాబితాలోకి శివనాగిరెడ్డి గారు వస్తారు వారి కృషి పట్టుదల అలాంటివి పిడుగురాళ్ల వెళ్ళడానికి ముందుగా అనుకున్నట్లు రేపు తెల్లవారుజామున బయలుదేరదామని రెడ్డి గారు అనుకున్నారు పాత గుంటూరు జిల్లా మ్యాప్ టోపీ బౌద్ధం పై పుస్తకాలు రెండు ప్రయాణంలో చదువుకోవడానికి నోట్ బుక్ అన్ని సంచిలో సర్దుకుని టీవీలో వార్తలు చూస్తూ అన్నం తింటున్న సమయంలో నాకు రావడం కుదరదని డ్రైవర్ నుంచి ఫోన్
రాగానే వార్తల మీద ఆసక్తి ఆవిరైంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనసు కకావికలం అవడం సహజం అలాంటి సందర్భంలోనే మనసును చక్క పట్టుకొని కార్యోన్ముఖుడు కావడం ఉత్తమల లక్షణం.
1.
రాగానే వార్తల మీద ఆసక్తి ఆవిరైంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనసు కకావికలం అవడం సహజం అలాంటి సందర్భంలోనే మనసును చక్క పట్టుకొని కార్యోన్ముఖుడు కావడం ఉత్తమల లక్షణం.
1.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి