అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 వజ్రాలను మెరుగు పెట్టడంలో దిట్ట అయిన ఒక ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి అవురంగ జేబ్ హయాములో కోళ్లూరును దర్శించి అక్కడి వజ్రపుగనుల్లో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తన ప్రయాణ నివేదికలో పొందుపరిచాడు. పూలి చింతల ప్రాజెక్టు నీటి ముంపు గ్రామమైన ఈ కోళ్లూరును కొల్లూరిపేట అని కూడా అంటారు. నేను 2015 అక్టోబర్ నెలలో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో చేజారిన తెలుగు వెలుగు కోహినూర్ వజ్రం అన్న వ్యాసం రాశాను అన్నారు శివ నాగిరెడ్డి గారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న జర్మన్ జి.డి.ఆర్ రేడియో వాళ్లు ఒక జర్మన్ దేశస్థుడు ఇంకొకరు తెలుగు కెమెరామెన్ ఇద్దరూ నన్ను సంప్రదించి కోళ్లూరు వెళ్లి అక్కడ నా ఇంటర్వ్యూ తీసుకున్నారు అని చెప్పాడు కూడా. శివ నాగిరెడ్డి గారు విజయవాడలో ఉదయం ఐదు గంటలకు బయలుదేరారు బెల్లంకొండ డిఎస్పీ గారి అనుమతితో ఆ ఊరుకు ఇన్నోవాలా  వస్తుండగా నాగిరెడ్డిపల్లిలో 16వ శతాబ్ది శిథిల శివాలయం  వారి కంటపడింది. ఒక నిమిషం  ఆగి పొలాల్లో దిక్కుమక్కు లేకుండా గడ్డి గాదంతో కమ్ముకుపోయిన శిథిలాలు  వారిని వదిలి పెట్టడం లేదు చుట్టూ చూసి మళ్ళీ రావాల్సిందే అని తీర్మానించుకొని  కారు ఎక్కారు కారణం చాలా దూరం వెళ్ళాలి కనుక  నాలుగైదు కిలోమీటర్లు వెళ్ళగానే మన్నె సుల్తాన్ (రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు బిరుదు) పాలెం దోవలో ఒక పాడుబడిన భైరవ ఆలయం ఆంజనేయ మండపం కనిపించాయి  జర్మన్ దేశస్థుని ప్రాధేయపడుతున్నట్లుగా చూశాను. పురాతన కట్టడాల పట్ల రెడ్డి గారి ఆసక్తిని గమనించిన తరువాత అతడు సరైన పొలాల్లోకి వెళ్లి ఆ గుడిని సమీపించారు  రాతి పలకల్ని గోడలుగా నిలబెట్టి గర్భాలయంలో వీరభద్రున్ని ప్రతిష్టించుకున్నారు  విజయనగరం కాలం నాటి నిలువెత్తు వీరభద్రుడు కాళ్లు చేతులు భిన్నమయినా చక్కని పనితనం ఆకట్టుకుంది  ఆ విగ్రహాన్ని గుంటూరు మ్యూజియానికి తరలిస్తే బాగుంటుందేమోనని  అనుకొని రెడ్డి గారు   సమాధానపరచుకునే లోపు కంది చేలలోనుంచి కందిరీగల గుంపు వారిని చుట్టు ముట్టాయి. జోబులో మాలు ముఖానికి అడ్డం పెట్టుకుని పరిగెత్తుకుంటూ కాలిక్కారు ప్రయాణం చేస్తున్నా కూడా నాగిరెడ్డిపల్లి శిధిల శివాలయం మన్నె సుల్తాన్ పాలెం వీరభద్రుని భిన్నమైన విగ్రహం ఆలనా పాలనా లేని  మమ్మల్ని వదిలి వేయడమేనా అని ప్రశ్నిస్తున్నట్లుగానే అనిపించింది.కామెంట్‌లు