అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇప్పుడు డబ్బు ఉంది కొయ్య ఉంది వడ్రంగులు ఉన్నారు లేనిదంతా ఆనాటి ఆలోచనలు ఓపిక కళాత్మక దృష్టి  అక్కడే నిలబడి స్థాణువుల చూస్తున్న రెడ్డి గారిని ఇంటి వాళ్ళు లోపలికి పిలిచి ఇల్లంతా కలయ చూపారు సున్నపుతాపడపు గోడలు కప్పులు చలువరాతి గచ్చు దీపాలు పెట్టుకునే కుళ్ళు కాలెత్తితే కానీ దాటలేని గడపలు  27 నాటి మద్రాస్ ఇనుప భూషణం సింహాసనాన్ని తలపించిన పందిరి మంచం చీమలు పట్టకుండా మంచం కోళ్ల కింద నీళ్ళు పోసుకోవడానికి గాడి చెక్కిన రాతి  దిమ్మెలు  వాటిపైన ఏమాత్రం తేడాలని  లేని  తరినే బట్టి పరిణల్ల తీర్చిదిద్దిన మంచం కోళ్ళు  మంచం పైన స్ప్రింగ్ పరుపు దోమ చేయగలి కట్టుకోవడానికి కట్టే చక్రం  రెడ్డి గారిని ఒక్కరి బిక్కిరి చేసాయి. ఎలాంటి వ్యక్తుల కైనా మానసిక విశ్లేషణ ఉంటుంది  నేను ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించే క్షణాలు అప్పుడప్పుడు మనకు తటస్తిస్తూ ఉంటాయి  అలాగే రెడ్డి గారు కూడా తాను ఈ ఇంటి యజమాని అయితే ఎంత బాగుండునో అన్న ఆలోచన పుట్టింది లక్ష్మీదేవితో సమానంగా చూసుకున్న రోలు  పొన్ను బిగించిన రోకళ్ళు అవి ఎన్ని పెళ్లిళ్లు చూసాయో చెప్పలేం  తరతరాల సంతానానికి పిండిని  అందించిన తిరగళ్ళు పల్నాటి జీవనాలి కళ్ళ ముందు కదిలించాయి  మొర్జంపాడు నుంచి బయలుదేరి మళ్ళీ పిడుగురాళ్ల వచ్చి తిరుగు ప్రయాణ  మైనం  గత కాలపు వైభవ ప్రభవాలు కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి వారసత్వ సంపద పట్ల నిర్లక్ష్యం నీడలా వెంటాడుతూనే ఉంది మంచి కాలం రాకపోతుందా అని ఆలోచించే లోపు విజయవాడకు చేరుకున్నారు శివ నాగిరెడ్డి గారు.
ఈ యాత్రలో మనం గమనించవలసిన విషయం  మన పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు  మాటకు మాట తెగులు నీటికి నాచు తెగులు అని  రెడ్డిగారు  నాస్తికత్వాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా భ్రమ చెంది  వారు అడిగిన ప్రశ్నకు  మౌనాన్నే సమాధానంగా ఇచ్చి  బయలుదేరడం వారి వ్యక్తిత్వానికి  చెరగని ముద్ర  వారు చేస్తున్న  ఈ బృహత్తర పరిశోధనలో  వారి మనసులోని మాటలను కూడా  బయటపెట్టి దానిని అక్షర రూపంలో మనకు అందించడం  వారి నిష్పక్షపాత దృష్టికి నిదర్శనం  వారు రాసిన ప్రతి పేరాలోనూ  వారు పడ్డ  శారీరక మానసిక  ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది  అది  నిజమైన స్థపతి  మనస్తత్వం అని నేను భావిస్తున్నాను.


కామెంట్‌లు