అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరి గుంటూరులో మరొక వ్యక్తిని  కూడా తీసుకొని పిడుగురాళ్ల పోదామనుకున్న ప్రణాళికకు ఆటంకం వచ్చి పడింది  అలాంటి సమయంలోనే మనసు  చిక్కబెట్టుకొని  ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి  చక చకా భోజనం చేసి మరో వ్యక్తిద్వారా ఒక రోజు వారి డ్రైవర్ని మాట్లాడుకున్న తర్వాత మనసు సుస్థిమితబడింది  ఆ డ్రైవర్ కి ఫోన్ చేసి విజయవాడ మొగల్రాజపురం లోని మధు మహాలక్ష్మి కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి దగ్గర మనీ  చెప్పి తన సహోద్యోగులు  చందు కార్తీక్ ను కెమెరా తీసుకొని సిద్ధంగా ఉండమని చెప్పి  రేపటి యాత్రలో మునిగి తెలియకుండానే నిద్రపోయారు రెడ్డి గారు. ప్రణాళిక ప్రకారం మరుసటి రోజు మూడు గంటలకే బయలుదేరి గుంటూరులో ఒక మిత్రుని  తమతో  తీసుకొని తెల్ల వారేసరికి  పిడుగురాళ్ల చేరుకున్నారు అక్కడ జర్నలిస్ట్ ప్రముఖ రచయిత పల్నాడు మీద పరిశోధనలు చేసిన కే హెచ్ వై మోహన్ రావు గారిని కలిసి టీ తాగి  పిలుట్లకు బయలుదేరాం  ఆ గ్రామం దాటేమో లేదో మోహన్ రావు గారు మళ్లీ ఫోన్ చేశారు వెనక తిరిగి వచ్చి ఆయన ఇచ్చిన గుంటూరు జిల్లా దేవాలయాల పుస్తకాన్ని  తీసుకున్నారు రెడ్డి గారు  పిడుగురాళ్ల అంటే వారి చిన్నతనం  లో మాట ఒకటి గుర్తుకొచ్చిందట  పంచాయితీ సమితి ప్రెసిడెంట్ కమిషనల్లో లేని హై స్కూల్ టీచర్లను పిడుగురాళ్ల బదిలీ  చేస్తారనే మాట అది  ఇప్పుడు పిడుగురాళ్ల మంచి  టౌన్ అయింది  1965-66 ప్రాంతంలో నీళ్లు దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు.ఎండాకాలం వేడి ఎక్కువగా ఉండడం  అక్కడ పిడుగులు రాళ్ల లాగా కురుస్తాయని అర్థంలో ఆ ఊరికి పిడుగురాళ్ల అని పేరు పెట్టారు  గుడిలో నల్లాలకు పిడుగురాళ్లలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగైన ఒక పగిలిన రాజు పైన క్రీస్తు శకం 1318 వ సంవత్సరపు శాసనం వారికి ఊరటనిచ్చింది  పాకుడు బట్టి రూపు పోగొట్టుకున్న అక్షరాన్ని తడిమి తడిమి చదివితే అది హనుమకొండ కురవరాశీ శ్వరుడైన కాకతీయ ప్రతాపరుద్ర దేవ మహారాజులకు పుణ్యంగా వైలెన్కమ్ గారి పుత్రుడు అయోధ్య రామలక్ష్మణులకు చేసిన  అస్పష్ట దాన వివరాలు ఉన్నాయి  ఒక్క అడుగు ముందు కేసిన తర్వాత 1882లో రాబర్ట్ చూసిన పిడుగురాళ్ల గుర్తుకొచ్చింది  పిడుగురాళ్లలో అమరావతిని పోరిన పెద్ద దిబ్బ దాని చుట్టూ పాతకాలపు కొండ పెంపులు ఉన్నాయని పాత పిడుగురాళ్లలో రెడ్డి రాజుల కోట గోడ శిథిలాలు ఉన్నాయని ట్రావెల్స్ బంగ్లా ఆవరణలో మాధవ రామమ్మ మంగమ్మ పిడుగురాళ్ల విషం చెల్లమ్మ అనే మూడు శిల్పాలు ఉన్నాయని కూడా సివేల్ రాశాడు.

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం