ఆశ్చర్యం ఏమిటంటే అక్షరాస్యత అంతగా లేని శృంగార సాహిత్యాన్ని బొత్తిగా తడమని గ్రామీణులకు నిశ్శబ్ద శృంగార ప్రేరణ కలిగించే బూతు బొమ్మలు విద్యాత్మకంగా ఉన్నాయి. ఒకామె తెల్లవారు జామున మజ్జిగ చిలుకుతుంటే పొలం పోయే పైలా పచ్చి మొగుడు వెనుకగా వచ్చి ఆనందాన్ని అందిస్తున్నాడు మరో జంట ఒకరికొకరు పైన కింద ఆసీనులై ప్రపంచాన్ని పట్టించుకోకుండా శృంగార కేళీ కలాపంలో మునిగితేలుతున్నారు బాగా పరిశీలిస్తే గాని ఆ మైధున శిల్పాలు కనిపించవు. ఇది ఆనాటి సమాచార ప్రసరణలో భాగమే కానీ బూతు కాదు, రోత కాదు ఆలయం బయట నిరాదరణకు గురైన వీరభద్రుని విగ్రహం రెడ్డి గారిని కాలు కదపకుండా చేసింది త్రిభంగిమలో నిలబడి అన్ని అలంకారాలను ధరించి కత్తి డాలు పట్టుకుని ఉన్న వీరభద్రుడు. ప్రభా మండలం క్రింద అంజలి ముద్రలో ఉన్న అధ్యక్షుడు శిల్పాని చెక్కిన తీరు తంగెడలోని రెడ్డి రాజుల కాలపు వీరభద్రుని తలపించింది క్రీస్తు శకం 14- 15వ శతాబ్దాలకు చెందింది సత్తువలేని ముసలి తాతను ఇంటి బయట కొట్టంలోకి నెట్టినట్టు ఆలనా పాలనా లేక కొంచెం భిన్నమైన ఈ విగ్రహాన్ని నిర్ధాక్షణ్యంగా ఆలయం ప్రకారం వెలుపల పడేశారు పూలు కొని ఆలయ లోపల పెట్టే నాధుడే లేడా అనిపించింది. ఒక నిట్టూరుపుతో ఆ ఊరును దాటారు రెడ్డి గారు కారులో పోతున్న కొలది చూసిన నంది స్తంభం వీరభద్ర విగ్రహం మధ్యలో పదేపదే మెదుడుతూనే ఉన్నాయి శృంగార శిల్పాలు అయితే అంగారక గ్రహం మీద కాలు మోపిన అనుభూతిని కలిగించాయి. ఇక రెడ్డి గారు చూపు మోర్జం పాడు వైపు ఎప్పుడు పిడుగురాళ్లలోని ఒక నగల వ్యాపారి తనకు ఫోన్ చేసి మా ఊళ్లో ఆలయం స్థితిలో పై ఉంది ఒకసారి చూసి పునరుద్ధరణకు సలహాలు ఇస్తారా అని అడిగిన విషయం జ్ఞాపకం వచ్చింది ఊరి చివరన ఉన్న ఐదు అడుగుల లోతు దిగుడు బావి పక్కనే తూర్పు చాళుక్యుల కాలంలో కట్టిన సాదాసీదా బుగ్గరామ లింగేశ్వరాలయాన్ని చూశారు అక్కడినుంచి కృష్ణా నది మూడు కిలోమీటర్లు ఉంటుంది నది లోతుగా ఉన్న ఇక్కడి నీటి ఓట ఐదు అడుగుల లోపే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించండి గ్రామస్తుడైతే అది ఆ ఊరి మహిమా అని చెప్పుకున్న నిజానికి సున్నపురాతి పొరల్లో నుంచి నీటి చాలు నిరంతరం వస్తూనే ఉంటుంది ఇది సహజ పరిణామమే కానీ మహిమకు సంబంధం లేదని స్థానికులకు పూజారికి శివ నాగిరెడ్డి గారు చెప్పారు.
అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి, చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి