హరివిల్లు 421
🦚🦚🦚🦚
అన్నా చెల్లెలు అక్కా
తమ్ముళ్ళ అనురాగం....!
సు రక్షా బంధనం తో
సంస్కృతికి వైభోగం......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 422
🦚🦚🦚🦚
శ్వేత వస్త్రం ధరించు
మానస వీణ సవరించు...!
సరస్వతిని స్మరించు
సువిద్యకై ధ్యానించు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 423
🦚🦚🦚🦚
హలం పట్టి దున్ను రైతు
మదిన మెదులు కుతూహలం..!
కూతురు పెళ్ళికి సరిపడు
పంటలు పండిన ఫలం.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 424
🦚🦚🦚🦚
ప్రయోజనం ఆశించి
జనులకై ప్రయోగాలు......!
భూ కక్ష్యను దాటి, గొప్ప
అంతరిక్ష పరిశోధనలు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 425
🦚🦚🦚🦚
ఇల్లిల్లు తిరిగి దిన
పత్రికలు చేరవేయును...!
సమాజాభివృద్ధి దిశగ
కార్యోన్ముఖుడగును......!!
( ఇంకా ఉన్నాయి )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి