హరివిల్లు రచనలు కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.

 హరివిల్లు 456
🦚🦚🦚🦚
జన్మనిచ్చు వరకు అమ్మ
రక్షించును *కడుపు లోన*.....!
తదుపరి కంటికి రెప్పై 
కాపాడును *భువి లోన*.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 457
🦚🦚🦚🦚
కొందరైన! ధన్వంతరి
బాట నడిచిన *బాగుండు*....!
ఉచిత వైద్య సేవలన్ని 
చేపట్టిన! *బాగుండు*..........!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 458
🦚🦚🦚🦚
దేవుణి యందు అనుమాన 
రహిత పూర్ణ నమ్మకం.........!
జీవన విధానమునకు 
ఉపయుక్త ప్రామాణికం..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 459
🦚🦚🦚🦚
కొత్త బట్ట కట్టు కున్న  
బుద్ధి పెరుగునా? *తుదకు*...!
అడ్డు రావు పాత గుడ్డ
లెపుడు *తెలివితేటలకు*.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 460
🦚🦚🦚🦚
పడతులందురు పట్టు
చీరలు కట్టుకున్నారు.....!
భక్తి తోటి బోన మెత్తి
అమ్మగుడికి చేరినారు.....!!
         ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు