హరివిల్లు రచనలు ;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,- 9440522864.
 హరివిల్లు 466
🦚🦚🦚🦚
విద్య వైద్య పథకములు
ఉచితముగ అందించవలె....!
సోమరులచేయు తదితర
ఉచితాలు మానుకోవలె......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 467
🦚🦚🦚🦚
*సైకిల్*
చవకగా దొరుకునుది
అలవోకగా పోవునది.........!
కాలుష్యమసలు లేనిది
వ్యాయామునకనువైనది.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 468
🦚🦚🦚🦚
మాటకు మాట పలుకుచు
లొంగక బదులిచ్చు *మాట*..!
పరస్పర మనస్పర్థై
వాగ్వివాద *యుద్ధమంట*...!!

🦚🦚🦚🦚
హరివిల్లు 469
🦚🦚🦚🦚
మాటలకందని మహా 
విషాద ప్రమాదాలు............!
కావొద్దు పునరావృత
దుర్ఘఘటన సంఘటనలు....!!
(ఇటీవలి రైలు ప్రమాద
దుర్ఘటనకు మనసు చలించి)
🦚🦚🦚🦚
హరివిల్లు 470
🦚🦚🦚🦚
ప్రకృతి  ఆకృతుల 
ఎదుట తాదాత్మ్య తపస్సు......!
అద్భుతమైన జగత్తును
ఆస్వాదించే మనస్సు............!!
                (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు