హరివిల్లు రచనలు ; - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 471
🦚🦚🦚🦚
మన ప్రజ్ఞపై పూర్తిగ
ఆధారపడవలదు.....!
మన సత్ప్రవర్తనయే
ప్రజ్ఞను పెంచ గలదు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 472
🦚🦚🦚🦚
అడుగడుగునభయపడిన 
విజయం వరించదు కదా....! 
ఓటమికి భయపడి వెను 
తిరుగుట సరి కాదు కదా...!!
🦚🦚🦚🦚
హరివిల్లు  473
🦚🦚🦚🦚
ఒకపరి పట్టి విడుచుట
కాదు  పట్టుదలంటే .....! 
తప్పదు శ్రమ పడుట 
నే గట్టెక్కాలంటే..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 474
🦚🦚🦚🦚
సప్తవర్ణ సుశోభితం 
విశ్వంభర విరాజితం.....!
తేట తెలుగు తేనెలొలుకు
పద్య గద్యామృతం........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 475
🦚🦚🦚🦚
తపస్సిద్ధులు ఋషి
పుంగవులు నా దేశం...!
తరగని భక్తి యుక్తులకు 
మారుపేరు నా దేశం...!!
             ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు