హరివిల్లు 476
🦚🦚🦚🦚
ఆవేశం ఆపుకొనక
స్వరమెత్తి వాగెడి నోరు.!
కోపముతో వివేకము
కోల్పోయిన మాట తీరు!!
🦚🦚🦚🦚
హరివిల్లు 477
🦚🦚🦚🦚
తోడున్న వారి పేరు
మరవడం! మతిమరుపు...!
మెదడుకు మేత పెట్టి
మెరుగుపరచు! కొసమెరుపు..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 478
🦚🦚🦚🦚
మందులు వాడుటొక్కటే
కాదు! రోగ విరుగుడుకు.!
మనో నిశ్చలత కూడా
ఆవశ్యకం! స్వస్థతకు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 479
🦚🦚🦚🦚
*తెలుగు భాష*
పలు భాషలకన్న
పై చేయి మన భాష....!
పున్నమి వెన్నెల్లోని
అమృతం పంచు భాష..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 480
🦚🦚🦚🦚
పోలేనంత మాత్రాన
క్రిందికి పడిపోలేము.....!
వెళ్ళకుండా అక్కడే
యున్న పైకి చేరలేము...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి