హరివిల్లు రచనలు ; - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,;- 9440522864.
 హరివిల్లు 426
🦚🦚🦚🦚
*చంద్రయాన్*
ఎగిరెగిరి పయనించి
చంద్రుని చేరుకొనెను....!
ఎవరడుగిడని చోటు
ఎంచుకొని సాధించెను...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 427
🦚🦚🦚🦚
శ్రావణ వర లక్ష్మిని 
పూజించిన శుభకరమే...!
చిత్త శుద్ది సంకల్పం
లోపించిన కలవరమే.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 428
🦚🦚🦚🦚
తప్పు చేసి తప్పించి
మురిసిపోతే ముప్పే...! 
తప్పు తెలుసుకొని మరల
తను చేయకున్న గొప్పే...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 429
🦚🦚🦚🦚 
సంఘవిద్రోహ శక్తుల
తుదముట్టడికి! *ఆంక్షలు*...!
కట్టడితో అంతరించి
పోవుటకు! *ఆకాంక్షలు*......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 430
🦚🦚🦚🦚 
విధి నిర్వహణను మరువక 
కర్తవ్యముగ భావించు.........!
అలుపు సొలుపు లేక
కలగలుపుగ నిర్వహించు......!!
             ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు