హరివిల్లు 431
🦚🦚🦚🦚
కన్న పిల్లలల్లాడిన
తల్లి గుండె తల్లాడును.....!
చేను పంటలు పండక
రైతు గుండె భరువయ్యెను...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 432
🦚🦚🦚🦚
అధిక శ్రావణ మాసము
అలవోకగ ఇష్టమయ్యె.....!
అధిక పుణ్య ఫలితము
అతి చవకగ లభ్యమయ్యె....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 433
🦚🦚🦚🦚
కాలయాపన ముదిరిన
మనకది యమయాతన....!
కాల సద్వినియోగ రుచి
చూపించె భక్త పోతన........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 434
🦚🦚🦚🦚
అనంత దుఃఖాన్నాపే
శక్తి అనంతుడుది.......!
అవసర శక్తిని ఇచ్చే
సత్తా హనుమంతుడిది....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 435
🦚🦚🦚🦚
శరీరానికి శిశిరం
నేర్పును జీవన సారం....!
రాలే ఎండుటాకుల
త్యాగ చరిత విస్తారం........!!
( ఇంకా ఉన్నాయి )
హరివిల్లు రచనలు ;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి