హరివిల్లు రచనలు ;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 436
🦚🦚🦚🦚
చద్ది అన్నం తినుచు
చదువుకున్నాడు గద్దర్....!!
జానపద పాటలు వ్రాసి
పాడుచు ఆడెను గద్దర్.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 437
🦚🦚🦚🦚
నిర్లిప్తతల వలన 
వ్యతిరేకత ఎదురౌను.....!
విశ్వాసముల వలన 
సుముఖత చేరువౌను......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 438
🦚🦚🦚🦚
అతిగా అత్యాశ పడిన
లోపల వ్యత్యాసాలు......!
అతిగా నిరాశ పడినను
లోలోన భీభత్సాలు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 439
🦚🦚🦚🦚
ఆపదలందు ఓదార్పు
పలు విధాల సాయపడును...!
అందించే చిరు సాయం 
పెరిగి పెరిగి పెద్దదగును.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 440
🦚🦚🦚🦚
చెదిరి చెదిరి నీరసించి
నా మనసు కుదుటపడునా...!
అరుదుగా సంతసించిన 
రోజులు అరుదెంచునా........!!
               ( ఇంకా ఉన్నాయి )
కామెంట్‌లు