అమ్మలకు అమ్మ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కస్తూరి దేవి విద్యాలయాన్ని గొల్లపూడి సీతారామశాస్త్రి తర్వాత కాలంలో (స్వామి సీతారాం)  కట్టమంచి రామలింగారెడ్డి వావిలి కొలను సుబ్బారావు లాంటి మహామహుడు దర్శించి పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు పరాయి ప్రభుత్వం తీసుకోకూడదని  పాఠశాల నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు  పాఠశాల భవన నిర్మాణానికి కనకమా బృంద వారు నాటక ప్రదర్శన ద్వారా నితురు సమకూరుస్తున్నారు విశాఖపట్నంలో శ్రీకృష్ణ తులాభారం  సారంగధర నాటకాలు వేయించారు మిక్కిలి సహకరించారు పాఠశాల వార్షికోత్సవాలలో   హరేంద్రనాథ్ చతోపాధ్యాయ  రాయప్రోలు సుబ్బారావు మొదలగు ప్రముఖులు పాల్గొనేవారు. 1950వ సంవత్సరం ఫిబ్రవరి వెన్నెల నెల్లూరులో పాఠశాల నిర్వహణకు విరాళాల సేకరణలో భాగంగా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి పాట కచేరి జరిగింది. కనకమ్మ వారు ఇంటింటికి తిరిగి అమ్మడంతో 1,30,000 టిక్కెట్లు అమ్మినారు ఖర్చులు పోను లక్ష రూపాయల నికర ఆదాయం మూలతనానికి చేకూర్చారు  1951లో విద్యాలయ రంజితోత్సవం వైభవంగా జరిగింది మంత్రి మాధవ వనం ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్  వి ఎస్ కృష్ణ హైకోర్టు న్యాయమూర్తి పిచంద్రారెడ్డిని పాల్గొన్నారు  కనకమ్మ గారు ద్రోణవరాజు లక్ష్మీబాయమ్మ గారు పద్యాలు రాశారు  కస్తూరి దేవి విద్యాలయానికి అనుబంధంగా పారిశ్రామిక విద్యాలయం నెలకొల్పాలని 1947 వ సంవత్సరంలో కనకమ్మ గారు సంకల్పించారు.
తిరువాన్ కోరు సోదరీమణులు లలితా పద్మిని  రాగిణిల నృత్య ప్రదర్శనలు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాట కచేరీలు నిర్వహించి 6000 సేకరించింది  1952 ఆగస్టు 16న పారిశ్రామిక విద్యాలయం కనకమ్మ గారి చెల్లెలి కుమార్తె వసుంధర  ప్రధానోపాధ్యాయునిగా ప్రారంభించారు పారిశ్రామిక విద్యాలయ నిర్వహణ కమిటీకి అధ్యక్షురాలు కనకమ్మ వాడే కనుక  బెజవాడ లక్ష్మీకాంతమ్మ గారు రేబాల సుజాతమ్మ గారు మొదలైన వారు సభ్యులుగా ఉన్నారు  లాంటి మద్రాస్ రాష్ట్ర విద్యామంత్రి మండలి వెంకటకృష్ణారావు ఈ పారిశ్రామిక విద్యాలయాన్ని  ప్రారంభించారు కస్తూరిదేవి పాఠశాల పాత భవనంలో మూడు కుట్టుమిషన్లతో ప్రారంభించిన విద్యాలయానికి దాతలు ఉదారంగా విరాళాలు ఇచ్చారు.

కామెంట్‌లు