ఏది సనాతనం ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఏ గృహిణి అయినా తన ఇంటిలో భగవంతుని ప్రార్థించడం కోసం  ఆ గదిని సుచిగా శుభ్రంగా ఉంచి  విగ్రహ ప్రతిష్టాపన చేసి  అలంకరణలతో  నింపి అప్పుడు  పూజకు ఉపక్రమిస్తుంది ఆ కుటుంబం  పూజ చేసేటప్పుడు  పత్రం  పుష్పం తోయం  ఫలం  అని శాస్త్రంలో చెప్పిన నాలుగు పదార్థాలను  ప్రక్కన ఉంచుకొని  ఆ సందర్భం వచ్చినప్పుడు వాటితో  స్వామికి నివేదిస్తారు  ఆ మాట ఎందుకు అన్నారు దాని అర్థం ఏమిటి ఇంట్లో కాకుండా మరి ఎక్కడో ఏకాంతంగా ఉన్నప్పుడు  ఈ పదార్థాలన్నీ తనకు దొరుకుతాయా  అన్నఅనుమానం ప్రతి ఒక్కరికి వచ్చి తీరుతుంది  అప్పుడు ఆ విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకున్న వారి వద్దకు వెళ్లి  దానిని తెలుసుకొని  భగవంతుని వేడుకుంటే అతని కోరికలు తీరతాయి.
ఒక వృక్షాన్ని పెంచాలి అనుకున్నప్పుడు ముందు బీజం వేయాలి  నీరు పోయాలి  తిన్నగా ఎదగడానికి ఏర్పాటు చేయాలి  అప్పుడు వృక్షం దాని నుంచి పుష్పం దాని నుంచి ఫలం  వస్తాయి  ఆ ఫలాన్ని హాయిగా ఆరగించవచ్చు  వాటిని గురించి శారీరకంగా మన భౌతిక స్థితిని ఆలోచించినట్లయితే  అన్నిటికీ బీజప్రాయమైన మనసు  దానిని సక్రమంగా ఉంచుకొని  దాని ద్వారా బుద్ధిని చేరి  దాని చెప్పు చేతలలో ఉంచుకున్న తరువాత  చిత్తం ఏర్పడుతుంది  ఆ చెప్తాం పరిపక్వయినా  సమయంలో మాత్రమే జ్ఞానం సిద్ధిస్తుంది  చెట్టుకి ఫలం చివరి దశ ఎలాగో  నీవు చేసే పూజకు కూడా  వచ్చే ఫలితం  పండు  అది పక్వం అయినప్పుడు మాత్రమేమార్గం ఏర్పడుతుంది  అప్పుడు మోక్షానికి అర్హుడు అవుతావు ఏ వ్యక్తి అయినా తన మనసును అదుపులో ఉంచుకోడు  విపరీతమైనటువంటి కోరికలతో  విలసిల్లుతూ ఉంటాడు  వాటిని అదుపులో ఉంచుకోకపోతే అది సంసారం అవుతుంది  ఆ సంసారంలో ఈదడంతో  జీవితం అంత అవుతుంది  ఆ కోరికలు కుళ్ళిపోక ముందే స్వామికి దాన్ని అర్పించినప్పుడు  జీవితం సఫలం అవుతుంది  తోయమంటే నీరు  ఆ నీరు లేకపోతే  బీజం పెరగదు  చెట్టుగా తయారై ఫలాలను ఇవ్వదు  కనుక ఈ మూడింటిని కాచి రక్షించేది తోయం నీరు కదా  ఆధ్యాత్మికంగా అది అహంకారానికి సంకేతం  అహం రాజసమో తామసమో అయితే ఇంత హేయమైన సంసార సాగరంలో ముంచి వేస్తుంది సాత్వికమైతే భగవంతుడి సన్నిధికి చేరుస్తుంది. ఎప్పుడైతే అహాన్ని మన శరీరం నుంచి తీసి భగవంతునికి అర్పిస్తే  అన్ని అతనిలోనే ఉంటాయి.



కామెంట్‌లు