ఏకసంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నేను ఆకాశవాణిలో చేరేసరికి సంగీత శాఖలో  ప్రొడ్యూసర్ గా బాలమురళీకృష్ణ గారు ఉన్నారు  లత గారు వారికి పరిచయం  చేస్తూ మురళీ ఇదిగో మీ గురువుగారు ఏబి ఆనంద్ ఇక్కడ పని చేస్తున్నాడు  అని చెప్పేసరికి  మురళి గారు చేతులు కట్టుకొని తల వంచి నమస్కారం గురువుగారు మన కచేరి ఎప్పుడు  అన్నారు హాస్యంగా  ఆ రోజు నుంచి వారు మరణించేంతవరకు నన్ను గురువుగానే భావించారు  వారింట్లో అందరూ  నన్ను ఇంటి సభ్యునిగానే చూశారు  వారి అమ్మాయికి మురళీ గారి మాతృమూర్తి సూర్యకాంతం గారి పేరు పెట్టుకున్నారు  మేం మాత్రం అమ్మాజీ అని పిలిచే వాళ్ళం  ఆమె ఎప్పుడు విజయవాడ వచ్చినా మన ఇంటికి రావడం  ఒకరోజు ఉండటం  ఆమె మద్రాస్ వెళ్ళగానే మురళి గారు అడిగే మొదటి ప్రశ్న గురువు గారి దగ్గరికి వెళ్ళావా అని.
అప్పటినుంచి ఆయనతో చాలాచొరవగా ఉండేవాణ్ణి  నేను నాన్నగారు వెళ్ళగానే  రారా ఆనంద్  మద్రాస్ ఎప్పుడొచ్చావ్ కూర్చో  అని మర్యాదలన్నీ అయిన తర్వాత  విషయం చెప్పాను  నేను వచ్చి పాడితే మాస్టారు గారు ఘంటసాల గారు  బాధపడతారేమో  ఆలోచించారా అన్నారు వారంతట వారు వెళ్ళిపోయి తిరిగి రాలేదు  తప్పు వారిదే కానీ మనది కాదు కదా  వారు వేరే అనుకోవడానికి అవకాశం లేదు  మీరు బయలుదేరండి అని  నేను చెప్పేసరికి ఐదు నిమిషాల్లో  మురళి గారిని తీసుకొని స్టూడియోస్ కి వచ్చాము  రాజేశ్వరరావు గారు చాలా ఆశ్చర్యపోయాడు  వీడెవడో చూడడానికి కుర్రాడుగా ఉన్నాడు మురళి గారి నే తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం నేనా అని. మురళి గారు రాగానే రాజేశ్వరరావు గారే సాదరంగా ఆహ్వానించారు అప్పటికే వాద్య బృందాలన్నీ  శృతి చేసి ఉండడంతో  పది నిమిషాల్లో  రికార్డింగ్ పూర్తి చేశారు.మురళి గారు  అంతటి సత్తా గల గొప్ప వ్యక్తి బాలమురళి గారు  వారి మిత్రులు సహాధ్యాయులు దత్తాడు పాండురంగరాజు ఎంవి రమణమూర్తి శ్రీ సూర్యరావు అంటే ఆయనకు ఎంతో ఇష్టం  బాలమురళీకృష్ణ గారి పేరు నిజంగా అపర కృష్ణ అవతారమే  ఎవరితో ఎలా మెలగాలో ఆయనకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదు  పెద్దలను గౌరవించడం ఆప్యాయంగా చేరదీయడం సహ ఉద్యోగులతో కలగలుస్తూ ఉండడం ఆయనకు  వెన్నతో పెట్టిన విద్య  వారి గురించి చెప్పాల్సి వస్తే అది ఒక నవలే అవుతుంది.




కామెంట్‌లు