శ్రీకృష్ణ పరమాత్మకు ఎనిమిది మంది భార్యలు పదహారువేల 108 మంది గోపికలు అని మన భాగవతంలో తెలిసిన విషయం అష్టభార్యలు రుక్మిణి సత్యభామ, జాంబవతి కాళింది, మిత్రవింద, భద్ర, లక్ష్మణ, నాగ్నచిత, స్త్రీ పురుషుని ప్రేమను అభిమానాన్ని పొందాలనుకుంటే ఎనిమిది రకాల పద్ధతులను ఎనిమిది మంది భార్యల చేత చెప్పించడం విశేషం గోపికలు అంటే మనము ఇచ్చినది త్రాగువారు ఏ మానవునికైనా కావలసినది జలము శరీరానికి సరిపడా నీరు తీసుకొనకపోయినట్లయితే శరీరం అనేక రకాల రుగ్మతలకు లోనవుతుంది. విరోచనం కాకపోవడం ప్రధానం దానివల్ల అనేక జబ్బులు శరీరానికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో నారాయణుడు ఉద్భవించి నార అంటే నీరు ఆ జలాన్ని ఎక్కువ తాగించడం వల్ల వారి రుగ్మతలను తీర్చారు అన్నది శాస్త్రీయ దృక్పథం మిగిలిన 108 నాడులలో సున్నను గురించిన 9 ఉపనిషత్తులు మానవ జీవన విధానాన్ని తెలియజేశాయి. సున్నాను తెలుసుకున్నట్లయితే ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే అజ్ఞాన తిమ్మిరాంధాకారంలో ఉన్న చాలామందిని విజ్ఞానులుగా తయారు చేయడానికి ఉపనిషత్ సాహిత్యం ఎంతో ఉపయోగంగా ఉంటుంది అన్న విషయం మనందరికీ విధితమే. ఏ కథ చెప్పినా దానిలో శాస్త్రీయ విజ్ఞానం లేకుండా ఏ ముని ఋషి మన ముందుకు కథలను కబుర్ల పోగుగా తీసుకురాలేదు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం కోసమే ఆ ఏర్పాట్లు. భర్తను స్వాధీనం చేసుకునే పద్ధతులలో రుక్మిణీదేవి భక్తి మార్గాన్ని ఎన్నుకున్నది శ్రీకృష్ణ పరమాత్మ ఎనిమిది మంది భార్యలలో రుక్మిణీదేవికే ప్రథమ స్థానం ఇవ్వడానికి కారణం పూజ పూజలో అంకితభావం కనిపిస్తుంది. మనసును ఏకాగ్రంగా ఆ విషయం మీదనే లగ్నం చేయడం సత్యమునే వ్రతముగా స్వీకరించినది సత్యభామ తన వ్యక్తిత్వానికి దెబ్బ తగిలితే ఏ చిన్న విషయాన్ని కూడా భరించని స్త్రీ ఆమె రాజవంశంలో పుట్టిన ఆమెకు యుద్ధ నైపుణ్యం కూడా తెలుసును రాక్షసులను హతమార్చడానికి కూడా యుద్ధ రంగంలో శ్రీకృష్ణ పరమాత్మకు సహాయంగా నిలబడి పురుషులకు మేము ఏమాత్రం తీసిపోము అని చెప్పే విధంగా ఆయుధాలు ఉపయోగించి విజయాన్ని స్వాధీనం చేసుకున్న సాత్వి సత్యభామ.
రుక్మిణి-సత్యభామ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి