ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నాన్నగారు  (ఆయన పరిచయం అయినప్పటి నుంచి నేను వారిని అలాగే పిలుస్తాను) వెంకటేశ్వర స్వామి భక్తులు  జనవరి ఒకటవ తేదీ  వచ్చినా ఉగాది వచ్చినా తప్పనిసరిగా శ్రీవారి  కళ్ళ ఎదుట ప్రత్యక్షం కావలసినదే వారెప్పుడూ ఏకాంతంగా వెళ్ళిన సందర్భాలు లేవు  నేను నాతో పాటు ఇద్దరు ముగ్గురు ప్రక్కన ఉండాలి  వీడెవరు వారి జేబులో నుంచి డబ్బులు తీయడానికి వీలు లేదు అది నియమం మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని  ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రతి  విగ్రహాన్ని చూసి దాని చరిత్ర మొత్తం  తెలియజేస్తారు  వారు కూర్చున్న సీటు  పైన  పెద్ద సైజులో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది  వారి సమక్షంలోనే  నాన్నగారు వైద్యం చేస్తున్న తృప్తిని పొందుతుంటారు. వారి మనసులో నిత్యం వెంకటేశ్వర స్వామి  నివసిస్తూనే ఉంటాడని మా నమ్మకం  స్త్రీలు పురుషులు ఎవరు వచ్చినా అందరికీ ఒకటే మార్గం తిరిగి వెళ్ళేటప్పుడు మార్గం వేరు  ఆడవారిలో ఎవరైనా ఒకరిని  ఆ ప్రక్కన రమ్మను అని నర్స్ తో కబురు చేస్తారు  ఎందుకు అలా చెప్పారో మాకు అర్థమయ్యేది కాదు  ఆమె వెళ్లిపోయిన తర్వాత  ఖాళీ సమయంలో ఎందుకు అలా చేశారు అని అడిగితే  ఆమె బయట చేరింది నా పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు  ఈ మార్గంలో రావడం నిషేధం అని చెప్పి మమ్మల్ని ఆశ్చర్య చకితులను చేస్తూ ఉంటారు  వారి ఆత్మీయ  బంధం కలవడం అన్నది సంచిత జన్మ ఫలంగా నేను భావిస్తాను  వారు ఏ  పని చేసిన దానిపై మనసు పెట్టి చేస్తారు.
ఒకరోజు ఉదయాన్నే  ఒక వృద్ధుడు కర్రపోటు వేసుకుంటూ  లోపలికి ప్రవేశించారు  వారిని చూడగానే పాదాభివందనం చేయాలని ఎవరికైనా అనిపిస్తుంది  మూర్తీభవించిన శంకరాచార్యుల వారే నడిగి వస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది వారి  ఆకారం  నాన్నగారు వారిని ఆహ్వానించి  పాదాభివందనం చేసి  రాకరాక వచ్చారు  మీ విశేషాలు తెలుసుకోవచ్చు  నా అడిగితే  నా పేరు లంక సాంబశివ శాస్త్రి అంటారు  నేను మీ ఇళ్లకు దగ్గరలోనే లోపల గా ఉంటున్నాను  అనగానే మాకు జ్ఞాపకం వచ్చింది  శృంగేరి పీఠాధిపతి కి  తర్క శాస్త్రం చెప్పిన వేద పండితులు  నాలుగు వేదాలను  భాష్య పూర్వకంగా చెప్పగలిగిన  గొప్ప  వేదాంతి  మీకు నేను చేయవలసిన సహాయం ఏమైనా ఉంటే చెప్పండి  హృదయపూర్వకంగా చేస్తాను అన్నారు నాన్నగారు.

కామెంట్‌లు