అమ్మలకు అమ్మ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 సర్వకాల సర్వావస్థల యందు శ్రీ కస్తూరి దేవి విద్యాలయం ఒక్కటే తన సన్నిధానం  అనుకున్నారు కరకమ్మగారు ఇల్లు వాకిలి సమస్తము అదే అనుకున్నారు  విద్యాలయంలో ఉండగా ఎన్ని ఇడుములు ఎదురైనా ముందుకు సాగారు ఆవిడ  కొన్ని సంవత్సరాలు మంచానికే పరిమితమైన  కొనక కనకమ్మ గారు 1963 సెప్టెంబర్ 15న  ఈ భౌతిక శరీరాన్ని చాలించి ఇంద్ర సభలో తాను చేయవలసిన మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేయడం కోసం అక్కడకు వెళ్లారు  ఆమె జీవితం ధన్యం  కనకమ్మ గారు మరణించిన విషయం తెలిసిన వెన్నెలకంటి రాఘవయ్య గారు  కనకమ్మ గారు ఆర్థిక కష్టాలతో పాటు మానసిక శారీరిక కష్టాలు ఎన్నిటినో అనుభవించారు  మొదట ఆస్తి నష్టం తర్వాత ప్రేమించిన భర్త వియోగం అనుంగు కుమార్తె అకాల మరణం వీటన్నిటికీ మించి తాను సృష్టించిన పెంచిన కస్తూరిదేవి విద్యాలయం తన పెత్తనం నుంచి జారిపోవడం ఆమె ఆరోగ్యాన్ని ఆయుషును కృంగదీశాయి. కనకమ్మ గారిది నిండు జీవితం సార్థకమైన ప్రాణం విజ్ఞానమంతమైన జీవ యాత్ర జీవితాంతం వరకు ఆమెను పూలలో పెట్టి పోషించిన ఆమె ఆత్మ బంధువులు ప్రశంసకు పాత్రులు  ఎక్కడెక్కడ స్త్రీ విద్య ఉద్ధరించబడుతుందో ఎక్కడెక్కడ మహిళల ప్రాథమిక హక్కులు రక్షించబడినవో ఎక్కడెక్కడ రైతు ఉద్యమాలు పుష్పించి ఫలించడం అక్కడక్కడ ఆమె పేరు వినపడగలదు  ఆమె మూర్తి కనపడగలరు సర్వేశ్వరుడు ఆమె ఆత్మకు శాంతిని ప్రసాదించుగాక  కనకమ్మ గారితో 40 ఏళ్ల సహచరిగా ఉన్న ద్రోణ రాజు లక్ష్మీబాయమ్మ  తనని వాడిలో సేవా త్యాగములు మూర్తి ప్రవహించిన సాక్ష్యం తల్లి ఆమె ఒక మహా సంస్థ  మహా జ్ఞాని కర్మయోగిని కారుణ్య మూర్తి గొప్ప కవయిత్రి అని వ్రాశారు  కనకమ్మ గారు ఎన్నో రంగాలలోని అందరికో మార్గదర్శనం చేసిన మహిళ నవరత్నం  నెల్లూరు జిల్లా  వాసులు గర్వించదగిన విధుషియమని.ఆచార్య ఎన్జీ రంగా గారి సతీమణి శ్రీమతి భారతి రంగా  గారు  ఏడుపును ఆపుకుంటూ  కనకమ్మ గారి మరణంతో ఒక ఆత్మబంధువును కోల్పోయాను  ఆంధ్ర మాత నీడొక గొప్ప పుత్రికలు కోల్పోయినది అటువంటి కోమల హృదయమే గాంచము అటువంటి హృదయురాలు మనకు దొరకదు ఆమె హృదయము అమిత మధురమైనది ఆమె స్నేహభావము అతి ప్రశంశార్ధకమైనది  ఆమె మరణం వచ్చే నేను ఒక ఆత్మబంధువును కోల్పోయాను అంటూ  దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు శ్రీమతి భారతీరంగా.



కామెంట్‌లు